రోడ్దెక్కిన విజయవాడ పారిశుద్ధ్య సిబ్బంది..వేతనాల కోసం ఆందోళన

రోడ్దెక్కిన విజయవాడ పారిశుద్ధ్య సిబ్బంది..వేతనాల కోసం ఆందోళన
X
9వ తేదీ వచ్చినా ఇప్పటివరకు తమకు జీతాలు రాలేదంటూ మున్సిపల్‌ కార్మికులు నిరసనకు దిగారు

విజయవాడ పాతబస్తీలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది రోడ్డెక్కారు, వేతనాల కోసం ఆందోళన చేపట్టారు. 9వ తేదీ వచ్చినా ఇప్పటివరకు తమకు జీతాలు రాలేదంటూ నిరసనకు దిగారు మున్సిపల్‌ కార్మికులు. మంత్రులు, ప్రజాప్రతినిధులకు లేని ఇబ్బంది, నిరుపేద కార్మికుల జీతాలు ఇవ్వటానికి ఎందుకు వస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. పండుగల వేళ పారిశుధ్య, ఇతర సిబ్బందికి సెలవు ఇవ్వకుండా.. , జీతాలు చెల్లించకుండా... తమతో వెట్టిచారికి చేయించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్‌ కార్మికులు. తక్షణమే వేతనాలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.

Tags

Next Story