అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా లోకేష్‌ పాదయాత్ర

అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా లోకేష్‌ పాదయాత్ర
X
శింగనమల నియోజకవర్గంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. శింగనమల నియోజకవర్గంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.. జై టీడీపీ, జై లోకేష్‌ నినాదాలతో శింగనమల దద్దరిల్లింది.ఇవాళ 66వ రోజు పాదయాత్ర సోడనపల్లి క్యాంప్‌ నుంచి ప్రారంభం అయింది. లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు.. ఓ వైపు భుజం నొప్పి బాధిస్తున్నా అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు.యువనేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు శింగనమల ప్రజలు.

మరోవైపు లోకేష్‌ స్థానికులను ఆప్యాయంగా పలకరించారు.. ఈ దృశ్యాలు టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.. ఇక లోకేష్‌ పాదయాత్రలో ఊహించని రీతిలో జన ప్రవాహం కనిపించింది.. దారిపొడవునా జనం బారులు తీరారు.. లోకేష్‌ను చూసేందుకు,ఆయనతో తమ సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

పెద్దమట్టగొందిలో యాదవ సామాజిక వర్గీయులతో భేటీ అయ్యారు లోకేష్‌.సలకంచెరువులో గాండ్ల, దళిత సామాజిక వర్గీయులతో సమావేశం అయి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.సాయంత్రం కొరిది పల్లిలో స్థానికులతో సమావేశం కానున్నారు. అనంతరం ఉల్లికల్లులో స్థానికుల సమస్యలను తెలుసుకుని వారికి భరోసా కల్గించనున్నారు లోకేష్‌..అనంతరం పాదయాత్రను ముగించుకొని రాత్రికి ఉల్లికల్లు దగ్గర విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

Tags

Next Story