కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముసలం

కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముసలం
నగర పాలక సమావేశం రసాభాసగా మారింది. 2.73 కోట్ల నిధుల వ్యయంపై ఒక వర్గం కార్పొరేటర్లు ప్రశ్నించారు

కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ముసలం పుట్టింది. వైసీపీ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో.. నగర పాలక సమావేశం రసాభాసగా మారింది. 2.73 కోట్ల నిధుల వ్యయంపై ఒక వర్గం కార్పొరేటర్లు ప్రశ్నించారు. చెత్త బుట్టల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సమాధానం చెప్పాలంటూ ఇంజనీరింగ్‌ అధికారులను పట్టుబట్టారు. అటు.. ఇదంతా చిత్రీకరిస్తున్న మీడియాపై మేయర్ సురేష్‌ బాబు చిందులు తొక్కారు. దీంతో మీడియా సమావేశాన్ని బహిష్కరించారు.


Tags

Read MoreRead Less
Next Story