డీజీపీకి వర్ల లేఖ.. లోకేష్‌ యాత్రకు రక్షణ కల్పించాలి

డీజీపీకి వర్ల లేఖ.. లోకేష్‌ యాత్రకు రక్షణ కల్పించాలి
66 రోజులుగా వేలమంది అభిమానులతో సాగుతున్న యాత్రను విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆందోళన

ఏపీ డీజీపీకి టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. నారా లోకేష్‌ పాదయాత్ర సజావుగా సాగేలా రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. 66 రోజులుగా వేలమంది అభిమానులతో సాగుతున్న యాత్రను విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఉవ్వెత్తున సాగుతున్న పాదయాత్రను చూసి కొంతమంది వైసీపీ పెద్దలకు కన్నుకుట్టిందని విమర్శించారు. లోకేష్‌ పాదయాత్రను భగ్నం చేస్తానంటున్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు వర్ల రామయ్య.

Tags

Read MoreRead Less
Next Story