మార్గదర్శి వ్యవహారంలో సీఐడి మరింత దూకుడు

మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సీఐడి మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇటీవల మార్గదర్శిపై ఏపీ సీఐడీ అధికారులు దాడులు నిర్వహించడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ విషయంలో మార్గదర్శికి మద్దతుగా కొందరు మీడియా సమావేశాలు పెట్టి మాట్లడుతున్నారు. ఇలా మాట్లాడుతున్న వారిపై సీఐడీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మార్గదర్శికి మద్దతుగా సదస్సులు, సమావేశాల్లో మాట్లాడుతున్న, లేఖలు రాస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
ఏ ఆధారాలతో మార్గదర్శిని సమర్థిస్తున్నారో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సిఐడి అధికారులు పేర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్గదర్శి వ్యవహారంలో ప్రధాని మోడీకి లేఖ రాసిన ప్రొఫెసర్ జివిఆర్ శాస్త్రికి నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహించి సమావేశాల్లో ప్రసంగించిన ఆడిటర్లు, న్యాయవాదులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారికి కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com