వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం
X
తదుపరి చర్యలకు సింగరేణి అధికారులు సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సందర్శించేందుకు సింగరేణి కాలరీస్‌ డైరెక్టర్లు వైజా

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. తదుపరి చర్యలకు సింగరేణి అధికారులు సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సందర్శించేందుకు సింగరేణి కాలరీస్‌ డైరెక్టర్లు వైజాగ్ చేరుకున్నారు. బిడ్డింగ్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్ ఇంటరెస్ట్‌లో పాల్గొంటారని సమాచారం. దీంతో పాటు సింగరేణితో కలిసి వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అంశంలో సాధ్యాసాధ్యాలను చర్చించనున్నారు. ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీతో కూడా సింగరేణి డైరెక్టర్లు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story