కేసీఆర్‌ దెబ్బ అంటే అట్లుంటది : కేటీఆర్

కేసీఆర్‌ దెబ్బ అంటే అట్లుంటది : కేటీఆర్

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ దెబ్బ అంటే అట్లుంటది మరి.. విశాఖ ఉక్కుపై తమ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందంటూ మంత్రి కేటీఆర్ కామెంట్స్‌ చేశారు‌. ఏపీ ప్రజలకు గులాబీ జెండానే అండ అన్నారు మంత్రి హరీష్‌రావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం బీఆర్‌ఎస్‌ పోరాటంతో కేంద్రం తోకముడిచిందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌పై కేసీఆర్‌, కేటీఆర్ డబ్బాలు కొట్టుకుంటున్నారని కౌంటరేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌. స్టీల్‌ప్లాంట్‌ను అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.

Read MoreRead Less
Next Story