అంబేడ్కర్ ఆశయాలు టీడీపీ ముందుకు తీసుకెళ్తుంది: ఆదిరెడ్డి వాసు,కాశి నవీన్

అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని టీడీపీ నేతలు ఆదిరెడ్డి వాసు, కాశి నవీన్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నేతలు.. మహానీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ ఆశయాలను టీడీపీ ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు తెలిపారు. ఇక దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవుతుంటే.. ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ పాలనలో దళితులు చిత్రహింసలకు గురవుతున్నారని.. టీడీపీ అధికారంలోకి రాగానే దళితులకు పెద్దపీఠ వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆదిరెడ్డి వాసు, కాశీ నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com