సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న వైసీపీ మండల కన్వీనర్లు

సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న వైసీపీ మండల కన్వీనర్లు
ఏలూరు జిల్లా శ్రీపర్రులో వైసీపీ మండల కన్వీనర్ తేరా ఆనంద్ ఆగడాలు మితిమీరాయి

సర్పంచ్‌లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వైసీపీ మండల కన్వీనర్లు కాలరాస్తున్నారు. ఏలూరు జిల్లా శ్రీపర్రులో వైసీపీ మండల కన్వీనర్ తేరా ఆనంద్ ఆగడాలు మితిమీరాయి. నేను వైసీపీ మండల కన్వీనర్‌ని.. ఇక్కడ నేనే బాస్‌నంటూ వీరంగం చేస్తున్నారు. శ్రీపర్రులో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఆనంద్ హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక సర్పంచ్‌లను పక్కన పెడుతున్నారని స్థానిక సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు.

శ్రీపర్రులో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్‌ను పిలవలేదు. దాంతో మమ్మల్ని ఎందుకు పిలవడం లేదంటూ వైసీపీ మండల కన్వీనర్ తేరా ఆనంద్‌ను ఫోన్‌లో సర్పంచ్ భాగ్యమ్మ నిలదీశారు. దాంతో తేరా ఆనంద్ రెచ్చిపోయారు. మహిళా అని చూడకుండా సర్పంచ్‌ భాగ్యమ్మను ఫోన్‌లోనే బండబూతులు తిట్టారు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ సర్పంచ్‌ను వైసీపీ మండల కన్వీనర్ ఘోరంగా అవమానించారు. పదవుల పేరుతో బరితెగించి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తేరా ఆనంద్ గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story