పంచాయతీలపై పిడుగు..డీపీవో వాహనం అద్దెను చెల్లించాలి

పంచాయతీలపై పిడుగు..డీపీవో వాహనం అద్దెను చెల్లించాలి
ఈనెల 45 వేల రూపాయలు చెల్లించాలని గొట్టిపాడు పంచాయతీకి కలెక్టర్ ఆదేశాలు

వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకుంది. అసలే నిధుల్లేక సతమతం అవుతున్న పంచాయతీలపై మరో పిడుగు పడింది. డీపీవో వాహనం అద్దెను ఒక్కో నెల ఒక్కో పంచాయతీ చెల్లించాలని కొత్తగా జీవోలు జారీ చేసింది. ఈనెల 45 వేల రూపాయలు చెల్లించాలని గొట్టిపాడు పంచాయతీకి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ప్రతినెలా వివిధ పనులపై గ్రామ పంచాయితీల సందర్శనకు డీపీవో వెళ్తుండటంతో ఖర్చు అవుతోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం చెల్లించడానికి గొట్టిపాడు పంచాయతీ ఆధ్వర్యంలో ఈనెల 17న అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌ల పేరిట సభ్యులకు ఇప్పటికే ఎజెండా కూడా పంపారు. కలెక్టర్ జీవోలపై సర్పంచ్‌లు, పంచాయతీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే నిధుల లేమితో నిర్వీర్యమైన పంచాయితీలపై ఇదేం బాదుడు అంటూ సర్పంచ్‌లు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story