వాలంటీర్లకు రెండు వందల ఆర్థిక సాయం కేసులో సుప్రీం సంచలన వాఖ్యలు

వాలంటీర్లకు రెండు వందల ఆర్థిక సాయం కేసు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయింది. వాదనల నేపధ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. ఈ కేసు రెండు పేపర్ల మధ్య కాదు..రెండు పార్టీల మధ్య వివాదంగా భావిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ సంస్థ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించి, వాటిని ప్రజలు అందుకునేలా సాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం 2020 సెప్టెంబరులో 2.56 లక్షలమంది వాలంటీర్లను నియమించింది. వారికి నెలవారీగా ఇచ్చే 5వేల గౌరవ వేతనానికి తోడు, విస్తృత సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రిక కొనుగోలు కోసం ఆ 2.56 లక్షలమంది గ్రామ వాలంటీర్లకు నెలకు రెండు వందల రూపాయలు చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ సంస్థ ఏపీ హైకోర్టులో దాఖలు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com