జగన్‌ ఢిల్లీ టూర్‌పై వంగలపూడి అనిత హాట్‌ కామెంట్స్‌

జగన్‌ ఢిల్లీ టూర్‌పై వంగలపూడి అనిత హాట్‌ కామెంట్స్‌
X

జగన్‌ ఢిల్లీ టూర్‌పై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హాట్‌ కామెంట్స్‌ చేశారు. 24వ సారి సీఎం ఢిల్లీ వెళ్లడం వెనుక మర్మం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు లేక వసతి వీవెన వాయిదా వేశామని సీఎస్ జవహార్‌ రెడ్డి అనడం విడ్డురంగా ఉందన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే సునీత, షర్మిల ఇళ్లకి మా నమ్మకం నువ్వే జగన్‌ స్టిక్కర్లు అతికించాలని డిమాండ్‌ చేశారు. వివేకా కుమార్తెకు మహిళలు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తామని అమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విజయ్‌ కుమార్‌ పవర్‌ఫుల్‌ పుజారి అయితే సీఎం దంపతులకు ఇచ్చినట్లే..రాష్ట్ర ప్రజలకు కూడా ఆశ్వీర్వాదాలు ఇవ్వాలని అన్నారు. సీఎం కుర్చీలో కూర్చోడానికి జగన్‌ అనేక అడ్డదారులు తొక్కారని ఆరోపించారు.

Tags

Next Story