ఎమ్మెల్యే ఆదిమూలంకు నిరసన సెగ.. ప్రశ్నలతో ముంచెత్తిన ప్రజలు

ఎమ్మెల్యే ఆదిమూలంకు నిరసన సెగ.. ప్రశ్నలతో ముంచెత్తిన ప్రజలు
X
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు వెంటాడుతున్నాయి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసన సెగలు వెంటాడుతున్నాయి. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను స్థానికులు ప్రశ్నలతో ముంచెత్తారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కేవీబీ పురం మండలం రాయపేడలో పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. గత నాలుగేళ్లుగా ఏం అభివృద్ధి చేశారని తమ గ్రామానికి వచ్చారని నిలదీశారు. రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, గోడౌన్, గ్రంథాలయం, సచివాలయ భవనాలు నిర్మించకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. ఒక్కసారిగా గ్రామస్తులు నిలదీయడంతో కంగుతిన్న వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం.. చివరికి ఎలాగోలా అక్కడి నుంచి జారుకున్నారు.

Tags

Next Story