హిందూపురం మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

హిందూపురం మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థి తులు నెలకొన్నాయి. వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుకలకు అధికారులు అనుమతి నిరాకరించడంతో టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు మున్సి పల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నెల 23న ఫంక్షన్ నిర్వహణ అనుమతి కోసం బాలకృష్ణ అభిమానులు అప్లై చేశారు. అయితే కార్యక్రమానికి ఇవాళ అనుమతి ఇస్తామన్న అధికారులు ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగారు. అంతే కాదు MGM గ్రౌండ్‌ను కేవలం క్రీడలకు మాత్రమే వినియోగించుకోవాలని.. ప్రై వేట్‌ ఫంక్షన్‌లకు ఇవ్వబోమన్నారు. అయితే పోలీసుల సమక్షంలో టీడీపీ నాయకులు, బాల కృష్ణ అభిమానులు చర్చలు జరిపిన ఫలితం లేకుండా పో యింది. దీంతో మున్సిపల్‌ అధికారుల తీరును నిరసిస్తూ బాలకృష్ణ అభిమానులు ఎండలో నిరసన తెలియజేస్తున్నారు. వేడుకల నిర్వహణ అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

Next Story