ప్రజల కోసం లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారు : గంటా శ్రీనివాస్

ప్రజల కోసం లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారు : గంటా శ్రీనివాస్

నారా లోకేష్‌ 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాలనుకోవడం గొప్ప విషయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నేటితో యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకోనుండటంతో విశాఖలోని టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక మండుటెండలు, వడగాల్పులను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారని గంటా శ్రీనివాస్ అన్నారు. పాదయాత్రకు తొలుత ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని.. ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో సర్కార్‌ వెనక్కి తగ్గిందన్నారు పల్లా శ్రీనివాస్‌. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని... జగన్‌ సర్కార్‌కు కౌంట్‌ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు బండారు సత్యనారాయణ.

Tags

Read MoreRead Less
Next Story