వైసీపీ నేత శ్రావణ్ కుమార్ నా భూమి ఆక్రమించాడు : బాషా

వైసీపీ నేత శ్రావణ్ కుమార్ నా భూమి ఆక్రమించాడు : బాషా
X

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత శ్రావణ్ కుమార్ తన భూమిని ఆక్రమించాడని మహబూబ్‌ బాషా అనే వ్యక్తి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు సమస్య చెప్పుకునేందుకు ప్రయత్నించిన బాధితుడికి అధికారులు మైక్ ఇవ్వలేదు. తనకు న్యాయం చేయాలని బాధితుడు నినాదాలు చేయడంతో పోలీసులు అతన్ని బయటకు లాక్కెళ్లారు. అనంతరం లోనికి రాకుండా తలుపులు క్లోజ్ చేశారు. ఆర్డీవో కరుణ కుమారి, ఎమ్మార్వో హేమంత్‌ కుమార్‌పై బాధితుడు మహబూబ్ బాషా తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేత శ్రావణ్ కుమార్ వద్ద వద్ద లంచం తీసుకుని తనకు అన్యాయం చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.

Tags

Next Story