సింహాద్రీశుడికి చందనోత్సవం

సింహాద్రీశుడికి చందనోత్సవం
సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం... రేపు (ఆదివారం) అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు

సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం... రేపు (ఆదివారం) అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా.. సుగంధ భరిత చందనంలో కొలువుండే సింహాద్రినాథుడు ఒక్క వైశాఖ శుధ్ద తదియనాడు.. మాత్రమే తన నిజ రూప దర్శనాన్ని ఇస్తాడు. దీనినే భక్తులంతా చందోనోత్సవంగాను, చందన యాత్రగానూ పిలుస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం.. లక్షలాది మంది వస్తారన్న అంచనాతో... భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారలు. ఉత్తరాంధ్ర తో పాటు తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరవుతారు.

తొలిసారిగా ఆన్ లైన్ టికెట్లు ప్రవేశపెట్టారు. అయితే ఆన్లైన్ టికెట్ల విక్రయాలు గందరగోళంగా మారడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎస్ బి ఐ, యూనియన్ బ్యాంక్ లలో విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉన్నా ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం, సాంకేతిక సమస్యల కారణంగా అక్కడ ఆలస్యం అవుతూ ఉన్నాయి. దీంతో భక్తులు బ్యాంకులకు వచ్చి వెనుదిరగాల్సి వెళ్లాల్సి వస్తోంది. 300, వెయ్యి టికెట్లు వెబ్సైట్లో చూపినప్పటికీ స్లాట్లో నిర్దేశించిన టికెట్లు అందుబాటులో ఉండటం లేదంటున్నారు భక్తులు. పారదర్శకత కోసం ఆన్లైన్ టికెట్లు ప్రవేశపెట్టినా పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story