AP : ఎర్రగొండపాలెం ఘటనపై సోమిరెడ్డి ఫైర్

AP : ఎర్రగొండపాలెం ఘటనపై సోమిరెడ్డి ఫైర్
X

ఎర్రగొండపాలెం ఘటనపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి భగ్గుమన్నారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ చూడని దౌర్భాగ్యకరమైన పరిస్థితులను ఈ అరాచక వైసీపీ ప్రభుత్వంలో చూడాల్సి వస్తుందని అన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసి.. భద్రతా సిబ్బందిని గాయపరచడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేత కాన్వాయ్‌పై రాళ్లు విసరడం, భద్రతా సిబ్బంది తలలు పగలగొట్టడం ఎప్పుడైనా చూశామా అని అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామి అయిన కేబినెట్‌ మంత్రి చొక్కా విప్పేసి రోడ్లపైకి వచ్చి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

Tags

Next Story