ఏపీలో అకాల వర్షం.. రైతులకు అపారనష్టం

ఏపీలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో విరుచుకుపడింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం రైతులకు అపారనష్టాన్ని మిగిల్చింది. వేలాది ధాన్యం బస్తాలు నీటమునిగాయి. అటు రాజమహేంద్రవరం, కోనసీమతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోను వడగళ్ల వాన రైతులను నిండా ముంచింది. వరి, అరటి, మిరప, మామిడి సహా పలు వాణిజ్య పంటలు నేలమట్టమయ్యాయి. పంటనష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com