వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్

వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. సుప్రీంకోర్టు పెట్టిన డెడ్‌లైన్ దగ్గరపడుతుండటంతో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. వివేకా హత్యను గుండెపోటుగా కట్టుకథ అల్లిందెవరు..?ప్రచారం చేయడంలో మీ పాత్ర ఏంటి..? అని వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ బృందం ప్రశ్నించినట్లు సమాచారం.
మృతదేహంపై గొడ్డలిపోట్లు స్పష్టంగా కనిపిస్తున్నా గుండెపోటు, రక్తపు వాంతులతో కూడిన మరణంగా ప్రచారం ఎందుకు చేశారనే అంశంపై పలు ప్రశ్నలు సంధించారు. హత్య జరిగిన స్థలాన్ని భాస్కరరెడ్డి తన అధీనంలోకి తెచ్చుకొని రక్తపు మరకల్ని శుభ్రం చేయించారని సీబీఐ అనుమానిస్తోంది. ఇదే అంశంపై భాస్కరరెడ్డిని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. వివేకా హత్య సమయంలో బెడ్ రూమ్, బాత్రూంలో రక్తపు మరకల్ని కడిగించడం.. ఆసుపత్రి నుంచి కాంపౌండర్‌ను పిలిపించి మృతదేహానికి బ్యాండేజీతో కట్లు కట్టించడం.. వివేకా గుండెపోటుతో మరణించారని పోలీసులకు సమాచారమివ్వడం, నిజమని నమ్మించేందుకు గాయాలు కనిపించకుండా పూలతో కప్పేయడం, ఫ్రీజర్ బాక్స్‌ను తెప్పించడం, గుండెపోటు మరణం అని ప్రచారం చేయడం.. లాంటి పరిణామాల వెనక భాస్కరరెడ్డి పాత్ర గురించి ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com