అమ్మో.. స్వరూపానందేంద్ర స్వామికి కోపం వచ్చిందా: సోమిరెడ్డి

అమ్మో.. స్వరూపానందేంద్ర స్వామికి కోపం వచ్చిందా: సోమిరెడ్డి
సింహాచలం చందనోత్సవం నిర్వహణపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

సింహాచలం చందనోత్సవం నిర్వహణపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. అమ్మో.. స్వరూపానందేంద్ర స్వామికి కోపం వచ్చిందా..నిన్నటి వరకు జగన్‌కి లాలిపాటలు పాడిన ఆయనకే కడుపు మండిందంటే ప్రభుత్వ వైఫ్యలం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుందని అన్నారు. సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన భక్తులకు నరకం చూపడం బాధాకరం అంటూ ట్వీట్‌ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త పాలనకు ఈ ఘటన ఓ నిదర్శనం అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు జగన్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని ట్వీట్‌లో డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story