నా ఉసురు తగులుతుంది..ఎమ్మెల్యే కాలర్‌ పట్టుకొని నిలదీసిన మహిళ

నా ఉసురు తగులుతుంది..ఎమ్మెల్యే కాలర్‌ పట్టుకొని నిలదీసిన మహిళ
అంగన్‌వాడి సెంటర్‌లో గత 15సంవత్సరాలుగా టీచర్‌గా పనిచేస్తున్న భారతిని కారణం లేకుండా విధుల నుంచి తొలగించిన వైనం

ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే శంకర నారయణకు నిరసన సెగ తగిలింది. తీవ్ర స్వరంతో ఎమ్మల్యేను నిలదీసింది మహిళ. గోరంట్ల మండలం భూగాని పల్లి అంగన్‌వాడి సెంటర్‌లో గత 15సంవత్సరాలుగా టీచర్‌గా పనిచేస్తుంది భారతి అనే మహిళ. అయితే అమెను కారణం లేకుండా విధుల నుంచి తొలగించిన అధికారులు వైసీపీకి అనుకూలంగా ఉన్న మహిళను విధుల్లోకి తీసుకున్నారు. ఇదే విషయంపై అనేక సార్లు వైసీపీ నేతలకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముందు తన గోడును వెళ్లబోసుకుంది, అయినా ఎమ్మెల్యే నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో ఎమ్మెల్యే కాలర్‌ పట్టుకొని నిలదీసింది. నా ఉసురు తగులుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో గ్రామంలో గందరగోళం నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే కార్యక్రమం ముగించుకు వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story