కర్నూలులో రెచ్చిపోతున్న రౌడీమూకలు

కర్నూలులో రెచ్చిపోతున్న రౌడీమూకలు
కర్నూలు జిల్లాలో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. పాతికేళ్ళ వయస్సు కూడా లేని యువకులు రోడ్లపై జులాయిగా తిరుగుతూ రౌడీయిజానికి

కర్నూలు జిల్లాలో రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. పాతికేళ్ళ వయస్సు కూడా లేని యువకులు రోడ్లపై జులాయిగా తిరుగుతూ రౌడీయిజానికి అలవాటు పడుతోన్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కర్నూలు జిల్లా బి.తాండ్రపాడులో రౌడీమూకల దౌర్జన్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఒకే రౌడీ గ్యాంగ్ మూడు చోట్ల దాడులకు తెగబడింది. నగర శివారులో రౌడీ మూక హల్‌చల్‌ చేశారు. జనంపైనా, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారిపైనా పట్టపగలే దాడులకు తెగబడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జగదీశ్వర్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ పై విచక్షణా రహితంగా దాడి చేసింది రౌడీ గ్యాంగ్‌. ఓ టీ దుకాణంలోకి చొరబడి.. ఆ వ్యక్తి మొహంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. ప్లేట్స్ తోనూ, కాళ్ళతోనూ దాడికి తెగబడుతోన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఏకంగా గ్యాస్ సిలిండర్‌ని ఎత్తి దాడిచేశారు.

ఇక ఇదే గ్యాంగ్ బి.తాండ్రపాడు లో నాగరాజు అనే వ్యక్తి పై దాడికి దిగడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్‌ స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ వాచ్‌మెన్,కాలేజీ స్టాఫ్ ముగ్గురి పై కూడా దాడులకు దిగింది రౌడీ మూక. అకారణంగా రౌడీ గ్యాంగ్‌ దాడులతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు బాధితులు.

Read MoreRead Less
Next Story