పాడుబడ్డ టిడ్కో ఇళ్లు

పాడుబడ్డ టిడ్కో ఇళ్లు
రాష్ట్ర ప్రభుత్వం మారడంతో పేదలకు అందకుండా పోయి అడవిని తలపిస్తున్న టిడ్కో ఇళ్లు

పేదలందరికీ ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఆధునాతన హంగులతో టిడ్కో గృహాలు నిర్మించారు. అయితే.. ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మారడంతో అవి పేదలకు అందకుండా పోయాయి. రాజమహేంద్రవరం రూరల్‌లోని ధవళేశ్వరం ఉప్పెర కాలనీ సమీపంలో కోట్లాది రూపాయల వ్యయంతో టిడ్కో ఇళ్లు నిర్మించారు. ప్రస్తుతం అక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అడవిని తలపించేలా మారిపోయిందని.. ఏళ్ల తరబడి వాటిని అలాగే వదిలేయడంతో అధ్వాన్నంగా మారిపోయిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన మున్సిపల్‌ శాఖ నిర్లక్ష్యంపై వామపక్షాల నేతలు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story