ఆసక్తిగా మారిన ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ(మంగళవారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ఈ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే అవినాష్ రెడ్డి పిటిషన్‌పై ఈ నెల 19న విచారణ చేపట్టిన ధర్మాసనం ఇవాళ్టి వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ వ్యవహారంలో అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కొట్టేస్తే.. అటు సీబీఐ దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో తొలి నుంచి అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్న సీబీఐ హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే మాత్రం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఇవాళ్టి హైకోర్టు విచారణ ఇటు అవినాష్ రెడ్డికి అటు సీబీఐకి కీలకం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com