రాజమండ్రిలో దారుణం.. డ్రైనేజీకి బలైన నిండు ప్రాణం

రాజమండ్రిలో దారుణం.. డ్రైనేజీకి బలైన నిండు ప్రాణం
X
నిర్మాణంలో ఉన్న డ్రైన్‌లో పడి నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు

రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయ్యింది. నిర్మాణంలో ఉన్న డ్రైన్‌లో పడి నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. జేఎన్‌ రోడ్డులోని షిర్డీసాయి మార్గ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు కల్పించకుండా డ్రైన్‌ నిర్మాణం చేపట్టారని మండిపడుతున్నారు. అధికారుల తీరుకు నిరసనగా టీడీపీ నేతలు, స్థానికుల ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags

Next Story