కొండెక్కిన జగనన్న స్టిక్కర్ల ప్రచారం.. మండిపడుతున్న భక్తజనం

కొండెక్కిన జగనన్న స్టిక్కర్ల ప్రచారం.. మండిపడుతున్న భక్తజనం
అధికార పార్టీ నేతల జగన్ స్టిక్కర్ల ప్రచారం పీక్‌ స్టేజ్‌కు వెళ్లింది. తిరుమల కొండను వైసీపీ శ్రేణులు వదలడం లేదు

అధికార పార్టీ నేతల జగన్ స్టిక్కర్ల ప్రచారం పీక్‌ స్టేజ్‌కు వెళ్లింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన మహా పుణ్యక్షేత్రం తిరుమల కొండను వైసీపీ శ్రేణులు వదలడం లేదు. టీటీడీ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. తిరుమల కొండపై వైసీపీ కార్యకర్తలు జగన్ స్టిక్కర్లతో ప్రచారం చేశారు. స్థానిక బాలాజీనగర్‌లో వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఇంటింటికి వెళ్లి జగన్ స్టిక్కర్లు అంటించడం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమలలో హిందూయేతర మతాల చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలు, స్టిక్కర్ల ప్రచారంపై నిషేధం ఉంది. అలాగే అలిపిరిలో తనిఖీ కేంద్రం దాటుకుని తిరుమల కొండపై వైసీపీ నేతలు స్టిక్కర్లు తీసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు టీటీడీ విజిలెన్స్‌ అధికారుల తీరుపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలకు టీటీడీ నిబంధనలు వర్తించవా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story