సీబీఐ దెగ్గర అందరి చిట్టా ఉంది..సీఎం జగన్‌పై ఆదినారాయణరెడ్డి ఫైర్‌

సీబీఐ దెగ్గర అందరి చిట్టా ఉంది..సీఎం జగన్‌పై ఆదినారాయణరెడ్డి ఫైర్‌
జగన్‌ పత్రికల్లో తన పేరు,చంద్రబాబు, సునీత పేర్లు రాశారని, సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అలానే రాస్తున్నారని మండిపడ్డారు

సీఎం జగన్‌ పై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఫైర్‌ అయ్యారు. జగన్‌ పత్రికల్లో తన పేరు,చంద్రబాబు, సునీత పేర్లు రాశారని, సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అలానే రాస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ వద్దన్నారన్నారని తెలిపారు. తాను తప్పు చేసుంటేఎక్కడైనా ఉరి తీసుకోవచ్చన్నారు. గొడ్డలి ఎక్కడ కొన్నది, కుక్కను కారుతో ఎవరు చంపారో తెలిసిందన్నారు జగన్‌కు అన్నీ తెలుసు కాబట్టే గొడ్డలి పోటు అన్నారని, సీబీఐ నిక్కచ్చిగా దర్యాప్తు చేస్తోందని అన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పక జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో ఎవరెవరికి సంబంధం ఉందో వారికి శిక్ష తప్పదన్నారు. సీబీఐ దగ్గర అన్ని అంశాలు ఉన్నాయని.. త్వరలో యాక్షన్ ఉంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story