కుటుంబం అంతా కలసి రాజశేఖర్‌ రెడ్డి పేరు భ్రష్టు పట్టించారు: రామకృష్ణ

కుటుంబం అంతా కలసి రాజశేఖర్‌ రెడ్డి పేరు భ్రష్టు పట్టించారు:  రామకృష్ణ
జగన్‌ మనుస్సు అంతా అవినాష్‌ రెడ్డి పైనే, జగన్‌ అధికార అహంతో పాలిస్తున్నారన్నారు

వైఎస్‌ జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ఱ హాట్‌ కామెంట్స్‌ చేశారు. వైఎస్‌ కుటుంబం అంతా కలసి రాజశేఖర్‌ రెడ్డి పేరు భ్రష్టు పట్టించారని ఆరోపించారు. జగన్‌ మనుస్సు అంతా అవినాష్‌ రెడ్డి పైనే ఉందని, జగన్‌ అధికార అహంతో పాలిస్తున్నారన్నారు.పులివెందులలో చిన్న పిల్లలను అడిగినా వివేకాను ఎవరు హత్య చేశారో చెపుతారని అన్నారు.సీబీఐ సరిగా దర్యాప్తు చేయకపోవడంతోనే నాలుగేళ్లు పట్టిందని అన్నారు. సీఎం స్వంత జిల్లాలో డాక్టర్‌ అచ్చన్న చనిపోతే పరామర్శించ లేదని ఆరోపించారు. మరోవైపు దేశంలో బీజేపీ సర్కార్‌తో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు.ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న వారిని మోదీ విమానాల్లో విదేశాలకు పంపిస్తున్నారని మండి పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story