అవినాష్ అరెస్ట్ తప్పదు.. అయినా కడిగిన ముత్యమే : ఎమ్మెల్యే రాచమల్లు

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదంటూ ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తారు.. కానీ బెయిల్‌పై బయటకొస్తారన్నారు. న్యాయస్థానంలో విచారణ తర్వాత అవినాష్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి హత్య చేశాడని రుజువైతే తాను రాజకీయాల్లో ఉండనని గతంలో చెప్పానన్నారు. కోర్టులో నేరం రుజువైతే రాజీనామా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. తనతో పాటు 9 మంది రాజీనామా చేస్తారని చెప్పారు. అవినాష్‌రెడ్డిని ముద్దాయిని చేస్తే రాజీనామా చేస్తామని చెప్పలేదన్నారు. అవినాష్‌రెడ్డి హింసను ప్రేరేపించడని మనఃసాక్షిగా నమ్ముతున్నామని తెలిపారు. మొదటి నుంచి తాను అదే చెబుతున్నానని.. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని రాచమల్లు స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com