సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు: బండి శ్రీనివాసరావు

ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గేదే లేదంటున్నాయి. నిన్న సీఎస్‌ను కలిసిన ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు.. జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జేఏసీలోని అన్ని సంఘాలతో విస్తృతంగా చర్చించి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రప్రాయోజిత పథకాల కింద వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 60 వేల మంది ఉద్యోగులకు ఇప్పటికీ మార్చి నెల జీతాలు అందలేదని తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. పీఆర్సీ అనంతరం మూడు కొత్త డీఏలు ప్రకటించాల్సి ఉందని, వాటిలో రెండు డీఏలను వెంటనే ప్రకటించాలని తేల్చిచెప్పారు. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి, ఐఆర్ ప్రకటించాలని బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com