వైసీపీలో దళితులను ఎదగనివ్వడంలేదు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

శింగనమల నియోజక వర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. దళితులను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త దళితులను ఎదగనీయడం లేదని ఆరోపించారు ఎస్సీ నేత. తమను అణిచివేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్.రాజకీయంగా తమను ముందుకు వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఎమ్మెల్యే భర్తకు దళితులంటే గిట్టదని అందుకే తమను ముందుకెళ్లనివ్వడం లేదని విమర్శించారు.
నిన్న నార్పలలో నిర్వహించిన సీఎం సభలో తమను పక్కకు నెట్టి వేశారని, పోలీసులతో తోయించారని కన్నీరు పెట్టుకున్నారు.ఎమ్మెల్యే పద్మావతి కోసం పార్టీలో కష్టపడ్డానన్నారు. తన భార్య హరితకు రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చినా.. ఏ ఒక్క కార్యక్రమానికి ఆహ్వానం లేదన్నారు. రాజకీయంగా ఎదిగితే ఆయనకు అడ్డు వస్తానని భావించి ముందుకు వెళ్లనివ్వడం లేదన్నారు. రాష్ట్ర పదవిలో ఉన్న తన భార్యను కనీసం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కూడా రానివ్వడం లేదని వాపోయారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com