నరసరావుపేట కేంద్రంగా ఖండాంతరాలకు డ్రగ్స్‌ దందా

నరసరావుపేట కేంద్రంగా ఖండాంతరాలకు డ్రగ్స్‌ దందా
సూడాన్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్న డ్రగ్స్ తయారీకి నరసరావుపేట పట్టణం అడ్డాగా మారిన వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది

ఏపీలో డ్రగ్స్‌ దందా కొత్త పుంతలు తొక్కుతోంది.. నరసరావుపేట కేంద్రంగా మాదక ద్రవ్యాల వ్యాపారం ఖండాంతరాలకు పాకింది.. సూడాన్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్న డ్రగ్స్ తయారీకి నరసరావుపేట పట్టణం అడ్డాగా మారిన వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.. నరసరావుపేటకు చెందిన సేఫ్ ఫార్మాకు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లుగా ముంబై కస్టమ్స్‌ అధికారుల విచారణలో తేలింది.. సేఫ్‌ ఫార్మా డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌రెడ్డిని ముంబై కస్టమ్స్‌ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.. సూడాన్‌కు తరలిస్తున్న 10 లక్షల ట్రామడాల్‌ ట్యాబ్లెట్లను కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.

ఏపీ డ్రగ్స్‌ దందా గుట్టును ముంబైలో రట్టు చేశారు కస్టమ్స్‌ అధికారులు.. సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్‌తో ట్రామడాల్ ట్యాబ్లెట్స్‌ను సేఫ్ ఫార్మా అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు.. సుడాన్‌కు పంపుతున్న కన్సైన్మెంట్‌ను అడ్డుకుని పరిశీలించారు కస్టమ్స్ అధికారులు.. ట్యాక్స్‌మెల్‌ ఎక్స్ 225 ట్యాబ్లెట్ల పేరుతో ట్రామడాల్ ట్యాబ్లెట్లు అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.. ఇప్పటి వరకు 3 కోట్ల 31 లక్షల ట్రామడాల్ స్ట్రిప్స్‌ సేఫ్ ఫార్మా సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఈ ఆరోపణలపైనా ముంబై కస్టమ్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు.. ఫస్ట్‌ వెల్త్‌ సొల్యూషన్స్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లుగా గుర్తించారు.. ఈ నేపథ్యంలోనే ఫస్ట్‌ వెల్త్‌ సొల్యూషన్స్‌ సీవోవో గుడిపాటి సుబ్రమణ్యాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు.. అటు శనగల శ్రీధర్‌ రెడ్డిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story