Nellore : NUDA అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫైర్

Nellore :  NUDA అధికారులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫైర్
X

నుడా ( nellore urban development అథారిటీ ) NUDA అధికారులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. మే 15 నాటికి నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ పనులు ప్రారంభించకపోతే నుడా కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తొందరలోనే వీసిని కలిసి పనులు ప్రారంభించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంత మేర పనులు జరిగాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పనులు రద్దు చేయడంతో అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు. ఆర్థిక శాఖ నిధులకు క్లియరెన్స్‌ ఇస్తే పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు.

Tags

Next Story