AP : డీఎస్పీని అవమానించిన మంత్రి జోగి రమేష్‌

AP : డీఎస్పీని అవమానించిన మంత్రి జోగి రమేష్‌
X

మంత్రి జోగి రమేష్‌ ఓ డీఎస్పీని దారుణంగా అవమానించారు.. నోరు కూడా పారేసుకున్నారు. పది మందిలో డీఎస్పీ మాన్షూ బాషాను మంత్రి జోగి రమేష్‌ అవమానించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. మచిలీపట్నంలో మంత్రి రోజా పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రోజాకు పుష్ప గుచ్చం ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ జాషువా ముందుకు రాగా.. ఎస్పీకి అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలని డీఎస్పీ మన్షూ బాషా కోరారు. ఇదే సందర్భంలో డీఎస్పీపై మంత్రి జోగి రమేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కకుపో అంటూ డీఎస్పీని గద్దించారు. డీఎస్పీ మన్హూ బాషాను మంత్రి జోగి రమేష్ అవమానించడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. డీఎస్పీని బెదిరించిన జోగి రమేష్‌ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story