Crime : అనుమానంతో భార్యను చంపిన భర్త

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో దారుణ హత్య జరిగింది. అనుమానంతో భార్యను అతి కిరాతకంగా భర్త నరికి చంపాడం కలకలం రేపుతోంది. భార్య రెండు చేతులు, మణికట్టు, మెడపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసాడు. తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.
కొన్నాళ్లుగా భార్య, భర్త దావీదుల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త వేధింపులు భరించలేక కూనాగరపేటలోని పుట్టింటికి వెళ్లింది. ఇకపై గొడవపడనని.. బాగా చూసుకుంటానని నమ్మించి మూడ్రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి మళ్లీ గొడవపడిన దావీదు. తెల్లవారుజామున నిద్రిస్తుండగా ఘాతుకానికి ఒడిగట్టాడు. పిల్లల కోసం దుబాయ్ నుంచి తిరిగొచ్చిన భార్య.. చివరికి కసాయి భర్త చేతిలోనే హత్యకు గురైంది. సెలవులు కావడంతో పిల్లలు కొయ్యలగూడెంలోని బంధువుల ఇంటికి వెళ్లారని.. లేకుంటే ఆ ముగ్గురిని కూడా చంపేసేవాడని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com