Yuvagalam : కర్నూలులో కొనసాగుతోన్న లోకేష్ ప్రభంజనం

Yuvagalam : కర్నూలులో కొనసాగుతోన్న లోకేష్ ప్రభంజనం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం ప్రభంజనం కొనసాగుతుంది. 83వ రోజు మంత్రాలయం విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మిగనూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు, మహిళలు భారీగా తరలివచ్చి యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. టీడీపీ, యువగళం జెండాలు, తోరణాలతో యువగళం హోరెత్తింది. దారి పొడువునా.. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో యువగళం పాదయాత్ర ఉరకలేత్తింది.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర.. జనప్రవాహమై ఉత్సాహంగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం చర్చి, గ్రామచావిడి, నడికైరవాడ గ్రామస్తులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత మిర్చి రైతులను కలిసారు. ఎండబెట్టిన మిర్చిని పరిశీలించారు. మిర్చి రైతులతో కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక మధ్యాహ్నం మాచాపురం శివార్లలో రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మాచాపురం శివార్లలో భోజన విరామం తీసుకుంటారు నారా లోకేష్‌.

సాయంత్రం 4 గంటలకు మాచాపురం శివార్ల నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. మాచాపురంలో స్థానికులు, ఎస్సీలతో భేటీ అవుతారు. 5 గంటలకు మాచాపురం ఆటోస్టాండ్ వద్ద స్థానికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. ఐదున్నర గంటలకు మాచాపురం శివార్లలో బిసి సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. ఇక సాయంత్రం 6.20 నిమిషాలకు నందవరం ఎస్సీ కాలనీలో దళితులతో సమావేశమవుతారు. అనంతరం నందవరం చర్చి వద్ద స్థానికులతో మాటమంతీలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా నందవరం శివారు విడిది కేంద్రానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

అంతకుముందు.. ఉదయం మంత్రాలయం నియోజకవర్గంలో కల్లుదేవకుంటలో గ్రామస్తులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. నాలుగేళ్లుగా తాము ఎదుర్కొంటున్న కష్టాలను యువనేతకు వివరించారు. గ్రామంలో డ్రైనేజీ, తాగుసాగు నీటి సమస్య ఉందని, పీహెచ్‌సీలో డాక్టర్, రెగ్యులర్ స్టాఫ్‌ను నియమించాలని తెలిపారు. స్థానికుల గోడు విన్న లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు చెందిన 8 వేల 660 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఫైర్ అయ్యారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో డ్రైనేజీ, ఇతర సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story