AP : పల్నాడులో భగ్గుమన్న వైసీపీ వర్గపోరు

X
By - Vijayanand |28 April 2023 5:51 PM IST
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కభంపాడు వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. కొన్నిరోజులుగా వైసీపీ నేతలు చంద్రారెడ్డి, చిట్టా నాగిరెడ్డి మధ్య ఆధిపత్య పోరునడుస్తోంది. మద్యం మత్తులో ఓ వ్యక్తిపై దాడి చేయడంతో కభంపాడు గ్రామం నివురు గప్పిన నిప్పులా మారింది. వైసీపీకి చెందిన ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం కభంపాడు గ్రామంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇద్దరు వైసీపీకి చెందినవారు కావడంతో కేసు నమోదు చేయాలా? వద్దా? అనే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com