ఏపీ సర్కార్‌పై ఉద్యోగ సంఘం నేతల ఆగ్రహం

ఏపీ సర్కార్‌పై ఉద్యోగ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. విజయవాడలో ఏపీ ఐక్యకార్యాచరణ సమితి అమరావతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఐక్యంగా పోరాటం చేస్తే సీఎం జగన్ దిగిరాక తప్పదని, ఐక్య ఉద్యమాల ద్వారా ముందుకు వెళ్లాలని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ మెడలు వంచేందుకు చేపట్టే ఉద్యమానికి కలిసి వస్తామని కార్మిక సంఘాలు హామీ ఇచ్చాయి. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అనుకూలంగా లేదని, చెప్పిన మాట ఎప్పుడూ అమలు చేయదని నేతలు విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధి లేని చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఇక ప్రభుత్వం తమ మధ్య గొడవలు పెడుతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com