హిందూపురం వైసీపీలో అసమ్మతి..కౌన్సిల్‌ సమావేశం గందరగోళం

హిందూపురం వైసీపీలో అసమ్మతి..కౌన్సిల్‌ సమావేశం గందరగోళం
ఛైర్ పర్సన్‌ ఇంద్రజ అవినీతి పాలన చేస్తున్నట్టు ప్లకార్డులు, నల్ల రిబ్బన్లతో 13 మంది వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు

శ్రీ సత్య సాయి జిల్లాలో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం వైసీపీలో అసమ్మతి సెగ రేగింది. హిందూపురం కౌన్సిల్‌ సమావేశం గందరగోళంగా మారింది. దీంతో ఒక్క నిమిషంలోనే కౌన్సిల్‌ సమావేశాన్ని ముగించారు. ఛైర్ పర్సన్‌ ఇంద్రజ అవినీతి పాలన కొనసాగిస్తున్నట్లు ప్లకార్డులు, నల్ల రిబ్బన్లతో వైసీపీకి చెందిన 13 మంది అసమ్మతి కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. కౌన్సిల్‌ హాల్‌లో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అటు.. టీడీపీ కౌన్సిలర్లు ఛైర్‌ పర్సన్‌ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

అంతకుముందు... ఛైర్ పర్సన్‌కు వ్యతిరేకంగా వైస్ చైర్మన్ బలరాం రెడ్డి ఆధ్వర్యంలో.. 13 మంది వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు సమావేశమయ్యారు. హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఎమ్మెల్సీ ఇక్బాల్.. మున్సిపల్ ఛైర్‌ పర్సన్ ఇంద్రజకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు గళం విప్పుతున్నారు. అటు.. కౌన్సిల్ హాల్ దగ్గరకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్ల భర్తలను పోలీసులు వెళ్లిపోవాలనడంతో.. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Tags

Read MoreRead Less
Next Story