వైసీపీలో బాలినేని సెగలు..

వైసీపీలో బాలినేని సెగలు..
అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని.. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు

వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సెగలు రేగుతున్నాయి. అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని.. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. బాలినేని చర్యతో వైసీపీ హైకమాండ్‌ షాక్‌కు గురైంది. చాలా కాలంగా వైసీపీ అధినేతలపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. ఇటీవల ఒంగోలు సీఎం పర్యటనలో.. సెక్యూరిటీ సిబ్బంది బాలినేనిని హెలిప్యాడ్‌ దగ్గరకు అనుమతించకపోవడంతో.. బాలినేని అలిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలినేనిని బుజ్జగించిన జగన్.. సభకు వచ్చేలా చేశారు.‌ ఇదే కాదు.. మరో రెండు, మూడు సందర్భాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం జగన్ బుజ్జగించే ప్రయత్నం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story