తాడిపత్రి ప్రజల సంపదను దోచుకున్న గజదొంగ పెద్దారెడ్డి: జేసీ

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చేసినా వెరైటీగా చేస్తారు. అస్మదీయులైనా, తస్మదీయులైనా ఆయన స్పందన భిన్నంగా ఉంటుంది. ఇపుడు ఆయన చేతికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దొరికారు. తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరు అంటూ ఫ్లెక్సీలు, పెద్దారెడ్డి వేసిన పోస్టర్‌లకు ప్రభాకర్‌రెడ్డి తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. పెద్దారెడ్డి ఫ్లెక్సీలపై సెటైర్లు వేశారు. ఫ్లెక్సీలకు ముద్దు పెడుతూ పెద్దారెడ్డి ఆరోపణలకు ఘాటుగా సమాధానం చెప్పారు. తాడిపత్రి ప్రజల సంపదను దోచుకున్న గజదొంగ పెద్దారెడ్డి అని అన్నారు.
తాను తాడిపత్రి ప్రజల మన్ననలు దోచుకున్న గజదొంగనని కానీ జనం సొమ్ము దోచుకున్న దొంగ పెద్దారెడ్డి అని అన్నారు. మరో ఏడాది ఉందని.. ఈలోగా దోచుకో దాచుకో అంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి. రాత్రి వేసిన ఫ్లెక్సీలు పొద్దున్నే ఎందుకు తొలగిస్తున్నావ్ అంటూ పెద్దారెడ్డిపై సెటైర్లు వేశారు. ఎల్లనూరు, పుట్లూరు సొంత మండలాల్లో పట్టును కోల్పోయారని.. మరో ఏడాదిలో తాడిపత్రిని కూడా పెద్దారెడ్డి వదిలేయాల్సి వస్తుందని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com