వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర పరాభవం.. సొంత కార్యకర్తలే చెప్పులు విసిరారు

వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర పరాభవం.. సొంత కార్యకర్తలే చెప్పులు విసిరారు
అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణకు సొంత పార్టీ నేతల నుంచే ఘోర పరాభవం ఎదురైంది

అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణకు సొంత పార్టీ నేతల నుంచే ఘోర పరాభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమందేపల్లి మండలం రేణుకానగర్‌ శివార్లకు ఎమ్మెల్యే చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామంలోకి రావొద్దంటూ ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. అయినా పోలీసుల సాయంలో గ్రామంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడంతో.. ఎమ్మెల్యే కారుపై వైసీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. చివరకు పెద్ద ఎత్తున కార్యకర్తల తిరుగుబాటుతో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనకుండానే వైసీపీ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story