నరసరావు పేట డ్రగ్స్ దందాపై కేంద్రం సీరియస్‌

నరసరావు పేట డ్రగ్స్ దందాపై కేంద్రం సీరియస్‌
డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు పాల్పడిన సేఫ్‌ ఫార్ములేషన్‌కు ఫార్మాక్సిల్‌ సభ్యత్వాన్ని రద్దు చేసింది

నరసరావు పేట కేంద్రంగా సాగిన డ్రగ్స్ దందాపై కేంద్ర ప్రభుత్వ స్పందించింది. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు పాల్పడిన సేఫ్‌ ఫార్ములేషన్‌కు ఫార్మాక్సిల్‌ సభ్యత్వాన్ని రద్దు చేసింది. డ్రగ్స్‌ ఎగుమతి చేసే కంపెనీలు ఫార్మూస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ - ఫార్మాక్సిల్‌-లో సభ్యత్వం ఉండాలి. డ్రగ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించడంతో ఏప్రిల్‌ 27లోగా సమాధానం ఇవ్వాలని ఫార్మాక్సిల్‌ నోటీసు జారీ చేసింది. 28వ తేదీకి కూడా కంపెనీ నుంచి స్పందన లేకపోవడతో... సేఫ్‌ ఫార్ములేషన్స్‌కు సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు ఫార్మాక్సిల్‌ ప్రకటించింది. 2018లో కేంద్ర ప్రభుత్వం బ్యాన్‌ చేసిన ట్రామాడల్‌ అనే మందును సేఫ్‌ ఫార్ములేషన్‌ సూడాన్‌, కాంగో తదితర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ఈ విషయాలను టీవీ5 బయటపెట్టింది. సేఫ్‌ ఫార్ములేషన్స్‌లో వరదలా పారిన విదేశీ పెట్టుబడులను టీవీ5 వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాలతో రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలు స్పందించాయి.

రాష్ట్రం నుంచి తీవ్రవాదులకు డ్రగ్స్‌ సరఫరా అవుతున్నా కళ్ళు ఇన్నాళ్ళూ నిద్రపోయిన రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ ఇపుడు మేలుకుంది. సేఫ్‌ ఫార్ములేషన్స్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.డ్రగ్‌ లైసెన్సును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు.తమ దర్యాప్తులో సేఫ్‌ ఫార్ములేషన్స్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడైందని ఆ విభాగం వెల్లడించింది. రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ సంస్థ అధికారులు మార్చి మార్చి 17, 21 తేదీల్లో సేఫ్‌ ఫార్ములేషన్స్‌ సంస్థలో తనిఖీ నిర్వహించారు. ట్రెమడాల్‌ మాత్రలను జనరిక్‌ పేరుతో విక్రయానికి అనుమతి ఇవ్వగా.బ్రాండెడ్‌ పేరుతో వీటిని అమ్ముతున్నట్లు అధికారులు సోదాల్లో బయటపడింది. బెంగళూరులోని ఫస్ట్‌ వెల్త్‌ సొల్యూషన్స్‌తోపాటు ఐరిస్‌ హెల్త్‌ గ్లోబల్‌ వెల్‌నెస్‌ సంస్థకు కూడా ఈ మాత్రలు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. దీనికి అనుమతులు తీసుకోలేదని, దీంతో వీటి ఉత్పత్తి నిలిపివేతకు ఆదేశాలిచ్చామని రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story