ఎమ్మిగనూరులో లోకేష్‌ పాదయాత్ర.. అడుగడుగునా నీరాజనం

ఎమ్మిగనూరులో లోకేష్‌ పాదయాత్ర.. అడుగడుగునా నీరాజనం
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 86వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 86వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న యువనేతకు.. జనం అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. వైసీపీ పాలనలో పడుతున్న కష్టాలను లోకేష్ దృష్టికి తీసుకొస్తున్నారు. అందరి సమస్యలు తెలుసుకుంటున్న యువనేత.. నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

పాదయాత్రలో భాగంగా కడిమెట్ల మదర్ థెరెస్సా కాలేజి వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొన్నారు లోకేష్‌. అనంతరం పాదయాత్రగా కడిమెట్ల ఫక్రీ సాదర్ చౌక్ కు చేరుకుని అక్కడ బిసిలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కడిమెట్ల మహాలక్ష్మి కాటన్ మిల్ వద్దకు చేరుకున్న లోకేష్‌ బుడగజంగాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎర్రకోట వద్ద వికలాంగులతో భేటీ అయ్యారు.

ఇక రాళ్లదొడ్డిలో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖిలో పాల్గొన్న అనంతరం అక్కడే భోజన విరామం తీసుకుంటారు లోకేష్. ఇక సాయంత్రం రాళ్లదొడ్డి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. గోనెగండ్ల ఆర్చి వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. అనంతరం పాదయాత్ర 11వందల కిలోమీటర్లకు చేరుకోనుండటంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పాదయాత్రగా వెళ్లి గోనెగండ్ల గింజిపల్లి క్రాస్ వద్ద వాల్మీకిలతో సమావేశం అవుతారు. అనంతరం మైనారిటీ, స్థానికులు, ఎస్సీ సామాజికవర్గీలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నేరుగా గాజులదిన్నె విడిది కేంద్రానికి చేరుకుని.. అక్కడే రాత్రికి బస చేయనున్నారు లోకేష్‌

Read MoreRead Less
Next Story