హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఏపీ కమర్షియల్ టాక్సెస్‌ సర్వీస్‌ అసోసియన్‌కు ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌ను సస్పెండ్‌ చేసింది

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ కమర్షియల్ టాక్సెస్‌ సర్వీస్‌ అసోసియన్‌కు ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఏపీ కమర్షియల్ టాక్సెస్‌ సర్వీస్‌ అసోసియేషన్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఇటీవల షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే షోకాజ్‌ నోటీసులను అధ్యక్షుడు సూర్యనారాయణ హైకోర్టులో సవాలు చేశారు. పిటిషనర్‌ తరుపున న్యాయవాదులు ఉమేష్ చంద్ర, రవిప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే షోకాజ్ నోటీసులు ఇచ్చిందని రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. రవిప్రసాద్‌ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. 2022లో జరిగిన ఘటనపై ఇప్పుడు షోకాజ్‌ నోటీసులెంటని ప్రశ్నించింది. నోటీసులపై తమకు అనుమానంగా ఉందన్న హైకోర్టు..షోకాజ్‌ నోటీసులను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read MoreRead Less
Next Story