తిరుమలలో కలకలం..ఉగ్రవాదులు ఉన్నట్లు మెయిల్

తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు మెయిల్ రావడం కలకలం రేపింది. ప్రంజల్ కుమార్ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. తిరుమలలో రెండు చోట్ల టెర్రరిస్టులు ఉన్నట్లు ప్రంజల్ కుమార్ లోకేషన్ అటాచ్ చేశాడు . దీంతో అలర్టైన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. తిరుమలలో సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే.. ఇది ఫేక్ మెయిల్ అని తేలడంతో.. ఊపరి పీల్చుకున్నారు పోలీసులు.
ఈ ఘటనపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి స్పందించారు. తిరుమలలో ఉగ్రవాదుల సంచారం లేదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో.. అప్రమత్తమై వివరాలు పరిశీలించామన్నారు. అయితే.. ఇదంతా ఫేక్ అని తేలిందన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని ఆకతాయి మెయిల్‌గా భావిస్తున్నామన్నారు ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి. మెయిల్‌పై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తిరుమలలో ఎలాంటి హై అలర్ట్ లేదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com