రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం..జన జాగరణ సమితి వినూత్న నిరసన

రేపు సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్న వేళ.. జన జాగరణ సమితి వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ జన జాగరణ సమితి ప్రతినిధులు ఫ్లెక్సీలు కట్టారు. రుషికొండలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లే దారిలో ఫ్లెక్సీలు వెలిసాయి. రాజధాని లేని సీఎంగా జగన్ దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని జనజాగరణ సమితి నేత వాసు అన్నారు. గొప్ప రికార్డు సృష్టించిన జగన్‌కు మోదీ ఘనంగా సన్మానించాలని ఎద్దేవా చేశారు. జగన్‌కు కేపిటల్ లెస్ సీఎం అనే బిరుదు ఇవ్వాలని చురకలంటించారు. ఎన్నికలకు ఏడాది ముందు మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ డేటా సెంటర్ నిర్మాణ పనులకు జగన్ హడావుడిగా శంకుస్థాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూస్తున్న జగన్‌ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని వాసు స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com