పాక ఇడ్లీ అంటే ఎంతో ఇష్టం: వెంకయ్యనాయుడు

పాక ఇడ్లీ అంటే ఎంతో ఇష్టం: వెంకయ్యనాయుడు
విజయవాడలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ట్రిపుల్ ఎస్ ఇడ్లీ సెంటర్‌లో టిఫిన్ చేశారు

విజయవాడలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ట్రిపుల్ ఎస్ ఇడ్లీ సెంటర్‌లో టిఫిన్ చేశారు. మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి పాక ఇడ్లీ తిన్నారు. ట్రిపుల్ ఎస్ ఇడ్లీ సెంటర్‌లో ఇడ్లీ తినేందుకు ప్రత్యేకంగా గన్నవరం నుంచి విజయవాడ వచ్చిన వెంకయ్యనాయుడు.. నాణ్యమైన ఇడ్లీ అందిస్తున్నారని హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్‌ను అభినందించారు.

పాక ఇడ్లీ అంటే తనకెంతో ఇష్టమని వెంకయ్యనాయుడు అన్నారు. సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని తెలిపారు. పిజ్జా, బగ్గర్లు తిని ఆరోగ్యాన్ని పాడు‌ చేసుకుంటున్నారని చెప్పారు. నేటి యువతకు మన వంటకాల రుచులను చూపించి అలవాటు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. అమ్మ చేతి ముద్ద ఎప్పుడూ అమృతమే అన్న వెంకయ్యనాయుడు.. ఇక్కడ తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story