AP : ఆర్5 జోన్‌పై ఇంప్లీడ్ కానున్న జడ శ్రావణ్ కుమార్

ఆర్5 జోన్‌పై రైతులు సుప్రీం కోర్టులో వేయనున్న స్పెషల్ లీవ్ పిటిషన్‌లో.. జైభీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ కానున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి భూ బదలాయింపు జరిగినప్పుడు.. ప్రభుత్వం ఎలాంటి యాజమాన్యం హక్కులు పొందదని శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రైతుల వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేయడం అత్యంత దురదృష్టకరమని.. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడటానికి తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. R5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇస్తే రాజధాని ప్రాంతంలో ఉన్న.. ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు బడుగు బలహీన వర్గాల.. ప్రయోజనాలు కాపాడటం రాజ్యాంగ విధి అన్నారు శ్రావణ్ కుమార్. రాజధాని ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం.. తమ పార్టీ సుప్రీంలో అమరావతి రైతులు తరపున పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com